ఇచ్ఛాపురం

11:26 వద్ద మార్చి 19, 2010 | అవర్గీకృతం లో రాసారు | వ్యాఖ్యానించండి
ఇచ్ఛాపురం
ఇచ్ఛాపురం శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము. చెన్నై- హవురా రైలు మార్గముపై ఓ ప్రముఖ రైల్వే స్టేషను, హవురా వైపు వెళ్లుతుండగా ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన చివరి స్టేషను ఇచ్ఛాపురం. అలాగే హవురా నుంచి చెన్నై వైపు వస్తువుండగా ఒరిస్సా రష్ట్రము తరువాత ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రవేశించుటప్పుడు మొట్టమొదటి పట్నము ఇచ్ఛాపురం. ఇందువలన ఇచ్ఛాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రపు ఉత్తర – తూర్పు అంటే ఈశాన్య ముఖద్వారముగా ప్రసిద్ధమైనది.
ఇచ్ఛాపురంలోని చూడదగిన స్ధలాలు –
శుద్ధికొండ త్రినాధస్వామి ఆలయము – ప్రతి సంవత్సరము కనుమ పండుగ నాడు జరుగు శుద్ధి కొండ యాత్రకు చుట్టు-ప్రక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలి వచ్చెదరు. ఇదే సమయమున హనుమత్ దర్శనోత్సవము కూడా ఇచ్చట జరుగును.
పీర్లకొండ – ఇది హిందూ-ముస్లీముల సమైక్య క్షేత్రము. పీర్లకొండపై వున్న కట్టడాలను 16 శతాబ్దములో, నవాబుల పాలన కాలమున ముస్లీములములు ప్రార్ధనా మందిరాలుగా వినియోజించుచుండిరి.
ప్రతి సంవత్సరము, మార్గశిర గురువారమున హిందువులు, తాము మ్రొక్కుకున్న మ్రొక్కులను   , హిందూ సాంప్రదయ ప్రకారముగా, ధూపదీప నైవేద్యాలను సమర్పించి తీర్చుకొనెదరు. ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా వంటి రాష్ట్రాలనుంచి, పీర్లకొండపై జరుగు ఉత్సవాలకు, వేలలాది ప్రజలు తరలి వచ్చెదరు.
పీర్లకొండ కట్టడాల వద్ద వున్న క్వారీత్రవ్వకాల పనులవలన ఈ కట్టడాలు సమీప భవిష్యత్తులో ధ్వంసమై, నాశనమయ్యే పరిస్ధితి ఏర్పడవచ్చును.
క్వారీలోంచి త్రవ్వి తీయబడిన రాళ్లు, ఒరిస్సాలోని భువనేస్వర్‌కు, మరియు ఆంధ్రాలోని విశాఖపట్నమునకు రావాణా చేయబడుచున్నవి.
స్వేచ్ఛావతి అమ్మవారు – అమ్మవారిని ప్రతి సంవత్సరము మకర సంక్రాంతి నాడు పూజలు చేసెదరు.

ఆంధ్ర ప్రదేశ్ రష్ట్రము

09:38 వద్ద మార్చి 19, 2010 | అవర్గీకృతం లో రాసారు | వ్యాఖ్యానించండి
ఆంధ్ర ప్రదేశ్ భారత దేశములోని ఒక ముఖ్యమైన రష్ట్రము. భారత దేశపు “అక్షయపాత్ర” అనే పేరు సంపాదించుకున్నది, మన ఆంధ్ర ప్రదేశ్. ఈ రాష్త్రము భారత దేశమున నాలుగవ అతి పెద్ద రాష్త్రమైనది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, అక్టోబరు 01, 1953 తేదిన ఏర్పడినది. తొలుత ఏర్పడినప్పుడు, కర్నూలు రాష్ట్రమునకు రాజధానిగా వుండెను. నవంబరు 01, 1956 న, రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు మార్చబడినది.

ఆంధ్ర ప్రదేశ్ భారత దేశములోని ఒక ముఖ్యమైన రష్ట్రము. భారత దేశపు “అక్షయపాత్ర” అనే పేరు సంపాదించుకున్నది, మన ఆంధ్ర ప్రదేశ్. ఈ రాష్త్రము భారత దేశమున నాలుగవ అతి పెద్ద రాష్త్రమైనది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, అక్టోబరు 01, 1953 తేదిన ఏర్పడినది. తొలుత ఏర్పడినప్పుడు, కర్నూలు రాష్ట్రమునకు రాజధానిగా వుండెను. నవంబరు 01, 1956 న, రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు మార్చబడినది.

ఈ రాష్ట్రము 12o37′, 19o54′ ఉత్తర అక్షాంశాల మధ్య, 76o46′, 84o46′ తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉన్నది.

భారత ప్రామాణిక రేఖాంశమైన 82o30′ తూర్పు రేఖాంశము రాష్ట్రంలోని కాకినాడ గుండా పోతున్నది.

గోదావరి మరియు కృష్ణా నదులు, రాష్ట్రమున ప్రవహించు ముఖ్యమైన నదులు.

కృష్ణా గోదావరి నదులు (ఉపగ్రహ ఛాయాచిత్రం)

Kumbham.jpg

(రాజముద్ర – పూర్ణ కుంభం)

Map of India with the location of ఆంధ్ర ప్రదేశ్ highlighted.

(ఆంధ్ర ప్రదేశ్ రాప్ట్ర పటము)

ఈ రాష్ట్రము 23 జిల్లాలుగా విభజించియున్నది.

ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు ->

1. కోస్తాంధ్రాకు చెందిన జిల్లాలు –

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా.

2. రాయలసీమకు చెందిన జిల్లాలు –

అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు.

3. తెలంగాణకు చెందిన జిల్లాలు –

ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డీ, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్.

ఆంధ్ర ప్రదేశ్ కు ఉత్తరాన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ భారత దేశములోని ఒక ముఖ్యమైన రష్ట్రము. భారత దేశపు “అక్షయపాత్ర” అనే పేరు సంపాదించుకున్నది, మన ఆంధ్ర ప్రదేశ్. ఈ రాష్త్రము భారత దేశమున నాలుగవ అతి పెద్ద రాష్త్రమైనది.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, అక్టోబరు 01, 1953 తేదిన ఏర్పడినది. తొలుత ఏర్పడినప్పుడు, కర్నూలు రాష్ట్రమునకు రాజధానిగా వుండెను. నవంబరు 01, 1956 న, రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు మార్చబడినది.

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.
Entries మరియు వ్యాఖ్యలు feeds.