ఇచ్ఛాపురం

11:26 వద్ద మార్చి 19, 2010 | అవర్గీకృతం లో రాసారు | వ్యాఖ్యానించండి
ఇచ్ఛాపురం
ఇచ్ఛాపురం శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము. చెన్నై- హవురా రైలు మార్గముపై ఓ ప్రముఖ రైల్వే స్టేషను, హవురా వైపు వెళ్లుతుండగా ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన చివరి స్టేషను ఇచ్ఛాపురం. అలాగే హవురా నుంచి చెన్నై వైపు వస్తువుండగా ఒరిస్సా రష్ట్రము తరువాత ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రవేశించుటప్పుడు మొట్టమొదటి పట్నము ఇచ్ఛాపురం. ఇందువలన ఇచ్ఛాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రపు ఉత్తర – తూర్పు అంటే ఈశాన్య ముఖద్వారముగా ప్రసిద్ధమైనది.
ఇచ్ఛాపురంలోని చూడదగిన స్ధలాలు –
శుద్ధికొండ త్రినాధస్వామి ఆలయము – ప్రతి సంవత్సరము కనుమ పండుగ నాడు జరుగు శుద్ధి కొండ యాత్రకు చుట్టు-ప్రక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలి వచ్చెదరు. ఇదే సమయమున హనుమత్ దర్శనోత్సవము కూడా ఇచ్చట జరుగును.
పీర్లకొండ – ఇది హిందూ-ముస్లీముల సమైక్య క్షేత్రము. పీర్లకొండపై వున్న కట్టడాలను 16 శతాబ్దములో, నవాబుల పాలన కాలమున ముస్లీములములు ప్రార్ధనా మందిరాలుగా వినియోజించుచుండిరి.
ప్రతి సంవత్సరము, మార్గశిర గురువారమున హిందువులు, తాము మ్రొక్కుకున్న మ్రొక్కులను   , హిందూ సాంప్రదయ ప్రకారముగా, ధూపదీప నైవేద్యాలను సమర్పించి తీర్చుకొనెదరు. ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా వంటి రాష్ట్రాలనుంచి, పీర్లకొండపై జరుగు ఉత్సవాలకు, వేలలాది ప్రజలు తరలి వచ్చెదరు.
పీర్లకొండ కట్టడాల వద్ద వున్న క్వారీత్రవ్వకాల పనులవలన ఈ కట్టడాలు సమీప భవిష్యత్తులో ధ్వంసమై, నాశనమయ్యే పరిస్ధితి ఏర్పడవచ్చును.
క్వారీలోంచి త్రవ్వి తీయబడిన రాళ్లు, ఒరిస్సాలోని భువనేస్వర్‌కు, మరియు ఆంధ్రాలోని విశాఖపట్నమునకు రావాణా చేయబడుచున్నవి.
స్వేచ్ఛావతి అమ్మవారు – అమ్మవారిని ప్రతి సంవత్సరము మకర సంక్రాంతి నాడు పూజలు చేసెదరు.

వ్యాఖ్యానించండి »

RSS feed for comments on this post. TrackBack URI

వ్యాఖ్యానించండి

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.
Entries మరియు వ్యాఖ్యలు feeds.