బారువ

10:11 వద్ద ఏప్రిల్ 10, 2010 | ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు లో రాసారు | వ్యాఖ్యానించండి

బారువ

బారువ శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలమునకు చెందిన ఒక గ్రామము. ఈ గ్రామము  “ఆలయాల” గ్రామమనే పేరుతో పేర్కొన్నది. ఇందుకు కారణము, ఈ గ్రామమున ఎటు చూసినా ఆలయాలే కనుబడును. బారువలోని ఆలయాలలో ప్రస్సిద్ధి చెందిన కొన్ని ఆలయాలు – శ్రీకోటిలింగేశ్వరస్వామివారి ఆలయము మరియు జనార్ధనస్వామివారి ఆలయము. అందమైన ప్రకృతి శోబలతో కూడిన ఈ ప్రదేశము, యాత్రికుల మనసులను మైమరచిన ప్రదేశముగా పేర్కొన్నది.

బారువ సముద్ర తీరము చాలా అందముగానూ, అహ్లాదకరముగాను వుండును. ఈ సముద్ర తీరమున, వేకువ జామున, ఉదయించు సూర్యుడిని దర్శించిన వారు, ఆ అందములో మైమరచిపోతారు.  మహాభారతము మరియు స్కందపురాణము వంటి మొదలైన పౌరాణిక గ్రంధాలలో బారువ తీరమునకు ఓ ప్రత్యేకత వున్నది. ప్రతి 12 సంవత్సరాలకొకసారి, వచ్చు పుష్కరమహోదయమునకు ఈ స్ధలము ప్రసిద్ధి గాంచినది.

తూర్పు కనుమల నుంచి మొదలై, ఒరిస్సా మరియు ఆంధ్రా రాష్ట్రముల గుండా  ప్రవహించి, బంగాళఖాతములో కలిసిపోవు మహేంద్రతనయ నదీ యొక్క సంగమస్ధలమే ఈ బారువ గ్రామము.

బారువ చరిత్ర

బారువ చరిత్ర స్కందపురాణము ఆధారముగా పలువురు సిద్ధాంతులుచే పేర్కొనబడినది. సుమారు 16 వేల సంవత్సరాల క్రితము, తూర్పు కనుమలలో సంచరించుచుండిరి. అప్పుడు ఒక అడవి జంతువును వేటాడబోయి, పాండవులు ఆ జంతువు కదిలే శబ్దము వైపు బాణము విడిచిరి. కానీ దురాదృశ్టవశాత్తుగా ఆ బాణము ఓ ఆవును తాకి, ఆ ఆవు మరణించినది. ఇది ఎరిగిన పాండవులు తాము చేసిన కుట్రకు బాధపడి, ఆవు హత్య మహాపాపమని, ఆ పాప విమోచనకై ఆలోచించగా, ఓ మునీశ్వరుడు ప్రత్యక్షమై మృతి చెందిన ఆవు యొక్క శవమును తీసుకువెళ్లి, సముద్రతీరమునందు ఆ ఆవుకు కర్మకాండములు జరపవలెనని సలహా ఇచ్చెను.మునీశ్వరుని సలహా ప్రకారము ఆ గోవుకు అంత్యక్రియలు జరిపి, అనంతరము మహేంద్రతనయనదీ మరియు సముద్రపు సంగమ స్ధలములో స్నానమాడి, తాము చేసిన పాపమునకు విమోచనము పొంది, మోక్షము పొందారన్నది చరిత్ర.

బారువ గ్రామము పుణ్యక్షేత్రాల నిలయముగా గుర్తింపు పొందినది. పాండవులు వేటాడిన గోవును కర్మకాండ కోసం సముద్ర తీరానికి తీసుకువచ్చుచుండగా గ్రామానికి పశ్చిమభాగములో ఆ గోవు నుండి కోటికి ఒకటి తక్కువ రక్తపుచుక్కలు ఒకేచోట నేలపై పడినట్లు చారిత్రిక కధనము . అందువలన ఈ స్థలాన్ని గుప్తకాశీగా పిలుతురు. ఈ ప్రదేశములోనే పాండవులు కోటిలింగేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికులు చెప్పెదరు. దీనికి దక్షిన వైపున బ్రహ్మజనార్ధన స్వామి ఆలయము, ఊరిమద్యలో జగన్నాధస్వామి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయము, మహంకాళీ, కనకదుర్గ ఆలయాలు ఇక్కడ వెలసి ఉన్నావి. నాటి నుంచి ప్రతి 12 ఏళ్లకొకసారి వచ్చే పుణ్యఘడియల్లో ఇలా అధిక సంఖ్యలో భక్తులు సముద్ర స్నానాలు చేపట్టడము సంప్రదాయముగా వచ్చుచున్నది.

బారువ సముద్రతీరము

వ్యాఖ్యానించండి »

RSS feed for comments on this post. TrackBack URI

వ్యాఖ్యానించండి

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.
Entries మరియు వ్యాఖ్యలు feeds.