శ్రీకాకుళం జిల్లా

09:39 వద్ద మార్చి 19, 2010 | ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు లో రాసారు | వ్యాఖ్యానించండి

శ్రీకాకుళం జిల్లా

శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమునకు, ఉత్తర- తూర్పు (ఈశాన్యము) దిశన వున్నది. ఈ జిల్లా  ఉత్తర అక్షాంశాల మధ్య మరియు  తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించియున్నది. నాగవాళి నదీ తీరమున ఉన్నది.

చరిత్ర-

ఒకానొక కాలమున, ఈ జిల్లా బౌద్ధ మతానికి ముఖ్య స్థానముగా ఉండెను. ఆ తరువాత, కళింగ సామ్రజ్యమున భాగముగానైనది. 6 నుంచి 14వ శతాబ్దము వరకు (అంటే 800 సంవత్సరాలు), ఈ స్థలము గాంగేయులచే పాలింపబడినది.

విశాఖపట్నం జిల్లాలో భాగముగా ఉండే ఈ జిల్లా, 15 ఆగష్టు 1950న ప్రత్యేక జిల్లాగా అవతరించినది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సాలూరు మండలంలోనుంచి 63 గ్రామాలు, బొబ్బిలి తాలుకా నుంచి 44 గ్రామాలు, విశాఖపట్నం జిల్లాలో క్రొత్తగా ఏర్పరచబడిన గజపతినగరమునకు బదిలీ చేశారు. మరలా 1979 సంవత్సరమున, విజయనగరం జిల్లా ఏర్పడినప్పుడు, సాలూరు, బొబ్బిలి, చీపురుపల్లి, పార్వతీపురం తాలూకాలను, క్రొత్త జిల్లాకు మార్చేశారు.

చరిత్ర-ఒకానొక కాలమున, ఈ జిల్లా బౌద్ధ మతానికి ముఖ్య స్థానముగా ఉండెను. ఆ తరువాత, కళింగ సామ్రజ్యమున భాగముగానైనది. 6 నుంచి 14వ శతాబ్దము వరకు (అంటే 800 సంవత్సరాలు), ఈ స్థలము గాంగేయులచే పాలింపబడినది.
విశాఖపట్నం జిల్లాలో భాగముగా ఉండే ఈ జిల్లా, 15 ఆగష్టు 1950న ప్రత్యేక జిల్లాగా అవతరించినది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సాలూరు మండలంలోనుంచి 63 గ్రామాలు, బొబ్బ్లి తాలుకా నుంచి 44 గ్రామాలు, విశాఖపట్నం జిల్లాలో క్రొత్తగా ఏర్పరచబడిన గజపతినగరమునకు బదిలీ చేశారు. మరలా 1979 సంవత్సరమున, విజయనగరం జిల్లా ఏర్పడినప్పుడు, సాలూరు, బొబ్బిలి, చీపురుపల్లి, పార్వతీపురం తాలూకాలను, క్రొత్త జిల్లాకు మార్చేశారు.

Srikakulam-Dist.jpg

శ్రీకాకుళం జిల్లాలో చూడదగిన స్ధలాలు ->

శ్రీకాకుళం – కోటేశ్వరస్వామి ఆలయము(గుడివీధి), సంతోషిమాత ఆలయం(పాతశ్రీకాకుళం), వెంకటేశ్వరఆలయం (గుజరాతీపేట), కోదండ రామస్వామి ఆలయం, జమియా మసీదు ముఖ్యమైన ప్రార్ధనా స్థలాలు.

కళింగపట్నం –  చారిత్రికంగా సముద్ర వాణిజ్య కేంద్రం. వంశధార నది ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ దర్గా షరీఫ్, షేక్ మదీనా అక్విలిన్ ఉన్నాయి. 23 కిలోమీటర్లవరకు కనుపించే ఒక దీప స్తంభం ఉంది.
బారువ – ఇక్కడ మహేంద్ర తనయ నది సముద్రంలో కలుస్తుంది, ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి ఆలయం, జనార్దన స్వామి ఆలయం ఉన్నాయి. ఒకప్పుడు ఇది ముఖ్యమైన ఓడరేవు. ఇది కొబ్బరి తోటలకు, కొబ్బరి పీచు పరిశ్రమకు కేంద్రం.
పొందూరు – ప్రఖ్యాతి గాంచిన పొందూరు ఖద్దరు తయారయ్యేది జిల్లాలోని పొందూరు లోనే.
మందస – మహేంద్రగిరి కొండ దుగువున ఉన్న ఈ వూరిలో వరాహస్వామి ఆలయం ఉంది. ఇక్కడి కోట దక్షిణ భారతదేశంలోనే ఎత్తైనదిగా చెప్పబడుతున్నది

వ్యాఖ్యానించండి »

RSS feed for comments on this post. TrackBack URI

వ్యాఖ్యానించండి

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.
Entries మరియు వ్యాఖ్యలు feeds.