సుమ్మాదేవి

18:46 వద్ద ఏప్రిల్ 18, 2010 | ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు లో రాసారు | వ్యాఖ్యానించండి

సుమ్మాదేవి

సుమ్మాదేవి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక గ్రామము. పలాస వద్ద వున్నది. ఈ గ్రామము జాతీయ రహదారి -15 వద్ద, మరియు విజయవాడ – హవురా రైలు మార్గముపై, పలాస నుంచి బయలుదేరి ఇచ్ఛాపురం వైపునకు వెళ్లు కొన్ని పాసింజర్ రైళ్లు ఆగు స్టేషన్.

మందస రోడ్డు

11:30 వద్ద ఏప్రిల్ 18, 2010 | ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు లో రాసారు | వ్యాఖ్యానించండి

మందస

మందస శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము. విజయవాడ- హవురా రైలు మార్గముపై మందస రోడ్డు, పాసింజర్ మరియు కొన్ని ఎక్స్‌ప్రెస్ బండులు ఆగు ఒక స్టేషన్.
మందస మండలములోని మహేంద్రగిరి వద్ద వున్న గుహాసముదాయములో, పాండవుల గుహ చూడదగినది. ఈ గుహలోనే పాండవులు చాలాకాలము అజ్ఞాతవాసములో వుండిరని చరిత్ర చెప్పుచున్నది.
ఇచ్చటగల వరాహలక్ష్మీనరసింహస్వామి మరియు ప్రక్కగల శివాలయములో శివరాత్రికి బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగును.

మండలంలోని గ్రామాలు

గౌడుగురంటి, బూదరసింగి, సిరిపురం, మొగలాయిపేట, పోతంగి, ముకుందాపురం,పోతంగిబిశ్వాలి, బెల్లుపటియా, హొన్నాలి, చీపి, సింగుపురం, నువగాం, దబరుసింగి, తుబ్బూరు, బంజరుయువరాజపురం, బోగబండ, సంధిగాం, కొంకాడపుట్టి, కిల్లోయి, మండవూరు, కుసుమల, హంసరాలి, ఛత్రపురం, దిమిరియా, జుల్లుండ, మండస, రాధాకృష్ణపురం, సిద్దిగాం, శ్రీరాంపురం, ములిపాడు, సొందిపూడి, బాలాజీపురం, బైరిసారంగపురం, ఉమ్మగిరి, పిటతోలి, పుచ్చపాడు, దబరు, గోవిందపురం, కొత్తపల్లి, భిన్నాల, వెంకటవరదరాజపురం, బలిగాం, కుంతికోట, వీరగున్నమపురం, పిడిమండ్స, మధ్య, సవరమధ్య, దేవుపురం, నరసింగపురం, కరపల్లి, కొండలోగం, రఘునాధపురం, మకరజోల, వాసుదేవపురం, అచ్చుతపురం, కొత్తకమలాపురం, వీరభద్ర, హరిపురం, అంబుగాం, లోహారిబండ, పితాలి, దున్నవూరు, మర్రిపాడు, గొల్లలపాలెం, లింబుగాం, నారాయణపురం, బంజరుకేసుపురం, రంగనాధపురం, అల్లిమెరక, సువర్ణపురం, సరియపల్లి, బహడపల్లి, రట్టి, బేతాళపురం, లక్ష్మీపురం, బిడిమి, చిన్నబరంపురం.

మందస మండలము –

దస్త్రం:Srikakulam mandals outline33.png

బారువ

10:11 వద్ద ఏప్రిల్ 10, 2010 | ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు లో రాసారు | వ్యాఖ్యానించండి

బారువ

బారువ శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలమునకు చెందిన ఒక గ్రామము. ఈ గ్రామము  “ఆలయాల” గ్రామమనే పేరుతో పేర్కొన్నది. ఇందుకు కారణము, ఈ గ్రామమున ఎటు చూసినా ఆలయాలే కనుబడును. బారువలోని ఆలయాలలో ప్రస్సిద్ధి చెందిన కొన్ని ఆలయాలు – శ్రీకోటిలింగేశ్వరస్వామివారి ఆలయము మరియు జనార్ధనస్వామివారి ఆలయము. అందమైన ప్రకృతి శోబలతో కూడిన ఈ ప్రదేశము, యాత్రికుల మనసులను మైమరచిన ప్రదేశముగా పేర్కొన్నది.

బారువ సముద్ర తీరము చాలా అందముగానూ, అహ్లాదకరముగాను వుండును. ఈ సముద్ర తీరమున, వేకువ జామున, ఉదయించు సూర్యుడిని దర్శించిన వారు, ఆ అందములో మైమరచిపోతారు.  మహాభారతము మరియు స్కందపురాణము వంటి మొదలైన పౌరాణిక గ్రంధాలలో బారువ తీరమునకు ఓ ప్రత్యేకత వున్నది. ప్రతి 12 సంవత్సరాలకొకసారి, వచ్చు పుష్కరమహోదయమునకు ఈ స్ధలము ప్రసిద్ధి గాంచినది.

తూర్పు కనుమల నుంచి మొదలై, ఒరిస్సా మరియు ఆంధ్రా రాష్ట్రముల గుండా  ప్రవహించి, బంగాళఖాతములో కలిసిపోవు మహేంద్రతనయ నదీ యొక్క సంగమస్ధలమే ఈ బారువ గ్రామము.

బారువ చరిత్ర

బారువ చరిత్ర స్కందపురాణము ఆధారముగా పలువురు సిద్ధాంతులుచే పేర్కొనబడినది. సుమారు 16 వేల సంవత్సరాల క్రితము, తూర్పు కనుమలలో సంచరించుచుండిరి. అప్పుడు ఒక అడవి జంతువును వేటాడబోయి, పాండవులు ఆ జంతువు కదిలే శబ్దము వైపు బాణము విడిచిరి. కానీ దురాదృశ్టవశాత్తుగా ఆ బాణము ఓ ఆవును తాకి, ఆ ఆవు మరణించినది. ఇది ఎరిగిన పాండవులు తాము చేసిన కుట్రకు బాధపడి, ఆవు హత్య మహాపాపమని, ఆ పాప విమోచనకై ఆలోచించగా, ఓ మునీశ్వరుడు ప్రత్యక్షమై మృతి చెందిన ఆవు యొక్క శవమును తీసుకువెళ్లి, సముద్రతీరమునందు ఆ ఆవుకు కర్మకాండములు జరపవలెనని సలహా ఇచ్చెను.మునీశ్వరుని సలహా ప్రకారము ఆ గోవుకు అంత్యక్రియలు జరిపి, అనంతరము మహేంద్రతనయనదీ మరియు సముద్రపు సంగమ స్ధలములో స్నానమాడి, తాము చేసిన పాపమునకు విమోచనము పొంది, మోక్షము పొందారన్నది చరిత్ర.

బారువ గ్రామము పుణ్యక్షేత్రాల నిలయముగా గుర్తింపు పొందినది. పాండవులు వేటాడిన గోవును కర్మకాండ కోసం సముద్ర తీరానికి తీసుకువచ్చుచుండగా గ్రామానికి పశ్చిమభాగములో ఆ గోవు నుండి కోటికి ఒకటి తక్కువ రక్తపుచుక్కలు ఒకేచోట నేలపై పడినట్లు చారిత్రిక కధనము . అందువలన ఈ స్థలాన్ని గుప్తకాశీగా పిలుతురు. ఈ ప్రదేశములోనే పాండవులు కోటిలింగేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికులు చెప్పెదరు. దీనికి దక్షిన వైపున బ్రహ్మజనార్ధన స్వామి ఆలయము, ఊరిమద్యలో జగన్నాధస్వామి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయము, మహంకాళీ, కనకదుర్గ ఆలయాలు ఇక్కడ వెలసి ఉన్నావి. నాటి నుంచి ప్రతి 12 ఏళ్లకొకసారి వచ్చే పుణ్యఘడియల్లో ఇలా అధిక సంఖ్యలో భక్తులు సముద్ర స్నానాలు చేపట్టడము సంప్రదాయముగా వచ్చుచున్నది.

బారువ సముద్రతీరము

సోంపేట

15:18 వద్ద మార్చి 21, 2010 | ఆంధ్ర ప్రదేశ్ లోని ముఖ్యమైన నగరాలు, పట్నాలు లో రాసారు | వ్యాఖ్యానించండి

సోంపేట

సోంపేట శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము. విజయవాడ – హవురా రైలు మార్గముపై, ఇది కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు మరియు పాసింజర్ రైళ్లు ఆగు ఒక ప్రసిద్ధ స్టేషను.
సోంపేట కొబ్బరి పీచు పరిశ్రమానికి ప్రసిద్ధి.
సోంపేట మండలములో మొత్తం 24 గ్రామాలున్నవి.
సోంపేట మండలానికి చెందిన గ్రామాలు –
మల్లగోవిందపురం
విక్రంపురం
సుంకిడి
బుసభద్ర
జలాంత్రపోతంగి
మక్కనపురం
పద్మనాభపురం
సరదాపురం
బేసిరామచంద్రపురం
లక్కవరం
పలాసపురం
జింకిభద్ర
బెంకిలి
ఋషికుడ్డ్ద
గొల్లగండి
బారువపేట
బారువ
కొర్లం
పాలవలస
కర్తాలిపాలెం
జగతికేసపురం
పొత్రకొండ
అనంతపురం
తాళ్ళభద్ర
తురువకశాసనం
ములపలం
గొల్లవూరు
ఉప్పలాం
రాజం
మామిడిపల్లి
పతినివలస
సిరిమామిడి
ఎకువూరు
నదుమూరు
బత్తిగల్లూరు
దొంకలూరు
ఎర్రముక్కాం
తొేటవూరు
నల్లూరు
గెడ్వూరు
మొగలిపాదు
దున్నవూరు
గొడియగట్టు
సోంపేటలోని కంటి ఆసుపత్రి –
[sompeta+Eye+hospital.png]
సోంపేట పట్టణ కేంద్రములో ఆరు దశాబ్దాల క్రితము కెనడాకు చెందిన వైద్యులు డా.బెన్ గలీసన్ సేవా ధృక్పధంతో ఏర్పాటు చేసిన ఆరోగ్యవరం కంటి ఆసుపత్రి ఉత్తరాంద్రలోనే కంటి రోగులకు ఎనలేని సేవలందిస్తూ మంచి గుర్తింపు పొందినది. ఉచితముగా వైద్య పరీక్షలు కంటి ఆపరేషనలు, అద్దాల సరఫరాతో పాటు ప్రత్యేక వైద్యశిబిరాలద్వారా పలు మారుమూల గ్రామాలకు వెళ్ళి సేవలందిస్తూ పేదలను ఆదుకోవడములో ముందడుగు వేస్తుంది. వైద్యరంగము విస్తరించిన ప్రస్తుత పరిస్థితులలో సైతము ఆంద్రాలోని పలు జిల్లాలు, ఒరిస్సాకు చెందిన అనేకమంది కంటి రోగులు ఇక్కడ చికిత్స చేసుకుంటున్నారు.

జాదుపూడి

15:09 వద్ద మార్చి 21, 2010 | ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు లో రాసారు | వ్యాఖ్యానించండి
జాదుపూడి
జాదుపూడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రపు శ్రీకాకుళం జిల్లా, కంచిలి మండలానికి చెందిన ఒక గ్రామము. ఈ గ్రామములో ఒక రైల్వే స్టేషన్ ఉన్నది. కాని ఇచ్చట పాసింజర్ బండులు మాత్రం ఆగుతాయి.
జాదుపూడి నుంచి 11 కిలోమీటర్ల దూరములో ఇచ్ఛాపురం రైల్వే స్టేషను వున్నది. అచ్చట హవురా, చెన్నై, విశాఖపట్నం, విజయవద, రాజమండ్రి, సికింద్రాబాద్ వంటి మొదలైన ముఖ్య పట్టణాలకు వెళ్ళు రైళ్లు ఆగుతాయి.

జాదుపూడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రపు శ్రీకాకుళం జిల్లా, కంచిలి మండలానికి చెందిన ఒక గ్రామము. ఈ గ్రామములో ఒక రైల్వే స్టేషన్ ఉన్నది. కాని ఇచ్చట పాసింజర్ బండులు మాత్రం ఆగుతాయి. జాదుపూడి నుంచి 11 కిలోమీటర్ల దూరములో ఇచ్ఛాపురం రైల్వే స్టేషను వున్నది. అచ్చట హవురా, చెన్నై, విశాఖపట్నం, విజయవద, రాజమండ్రి, సికింద్రాబాద్ వంటి మొదలైన ముఖ్య పట్టణాలకు వెళ్ళు రైళ్లు ఆగుతాయి.

ఇచ్ఛాపురం

11:26 వద్ద మార్చి 19, 2010 | అవర్గీకృతం లో రాసారు | వ్యాఖ్యానించండి
ఇచ్ఛాపురం
ఇచ్ఛాపురం శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము. చెన్నై- హవురా రైలు మార్గముపై ఓ ప్రముఖ రైల్వే స్టేషను, హవురా వైపు వెళ్లుతుండగా ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన చివరి స్టేషను ఇచ్ఛాపురం. అలాగే హవురా నుంచి చెన్నై వైపు వస్తువుండగా ఒరిస్సా రష్ట్రము తరువాత ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రవేశించుటప్పుడు మొట్టమొదటి పట్నము ఇచ్ఛాపురం. ఇందువలన ఇచ్ఛాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రపు ఉత్తర – తూర్పు అంటే ఈశాన్య ముఖద్వారముగా ప్రసిద్ధమైనది.
ఇచ్ఛాపురంలోని చూడదగిన స్ధలాలు –
శుద్ధికొండ త్రినాధస్వామి ఆలయము – ప్రతి సంవత్సరము కనుమ పండుగ నాడు జరుగు శుద్ధి కొండ యాత్రకు చుట్టు-ప్రక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలి వచ్చెదరు. ఇదే సమయమున హనుమత్ దర్శనోత్సవము కూడా ఇచ్చట జరుగును.
పీర్లకొండ – ఇది హిందూ-ముస్లీముల సమైక్య క్షేత్రము. పీర్లకొండపై వున్న కట్టడాలను 16 శతాబ్దములో, నవాబుల పాలన కాలమున ముస్లీములములు ప్రార్ధనా మందిరాలుగా వినియోజించుచుండిరి.
ప్రతి సంవత్సరము, మార్గశిర గురువారమున హిందువులు, తాము మ్రొక్కుకున్న మ్రొక్కులను   , హిందూ సాంప్రదయ ప్రకారముగా, ధూపదీప నైవేద్యాలను సమర్పించి తీర్చుకొనెదరు. ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా వంటి రాష్ట్రాలనుంచి, పీర్లకొండపై జరుగు ఉత్సవాలకు, వేలలాది ప్రజలు తరలి వచ్చెదరు.
పీర్లకొండ కట్టడాల వద్ద వున్న క్వారీత్రవ్వకాల పనులవలన ఈ కట్టడాలు సమీప భవిష్యత్తులో ధ్వంసమై, నాశనమయ్యే పరిస్ధితి ఏర్పడవచ్చును.
క్వారీలోంచి త్రవ్వి తీయబడిన రాళ్లు, ఒరిస్సాలోని భువనేస్వర్‌కు, మరియు ఆంధ్రాలోని విశాఖపట్నమునకు రావాణా చేయబడుచున్నవి.
స్వేచ్ఛావతి అమ్మవారు – అమ్మవారిని ప్రతి సంవత్సరము మకర సంక్రాంతి నాడు పూజలు చేసెదరు.

విజయనగరం జిల్లా

10:07 వద్ద మార్చి 19, 2010 | ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు లో రాసారు | వ్యాఖ్యానించండి

విజయనగరం జిల్లా

విజయనగరం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రపు ఉత్తర-తూర్పు (ఈశాన్యము) దిశన వున్నది. ఆంధ్ర ప్రదెశ్ రాష్ట్రములోని అన్నీ జిల్లాలకంటే ఈ జిల్లే అత్యంత క్రొత్తది. ఈ జిల్లా బంగాళ ఖతము నుంచి 18 కిలోమీటర్ల దూరములో వున్నది.

చరిత్ర :-
పూసపటి వంశపు పాలకులు పరిపాలించిన ఒక సంస్థానమే విజయనగరము. 1754 వ సంవత్సరమునందు, ఈ సంస్థానమును పాలించుచున్న పూసపాటి విజయరామ గజపతి రాజు ఫ్రెంచి వారితో ఒప్పందము చేసుకొని పాలన కొనసాగించెను. కాని కొంత కాలమునకే సాగిన ఈ పాలన, బ్రిటీషు వారు విజయనగరమును తమ ఆధీనములోకు తీసుకుపోవుటవలన ఆగిపోయినది.ఆ తరువాత, భారత దేశమునకు స్వతంత్రము వచ్చే వరకు, విజయనగరం బ్రిటీషు వారి ఏలుబడిలోనే వుండిపోయినది.
విజయనగరం జిల్లాలో ప్రవహించు ముఖ్యమైన నదులు
గోస్తని, నగవాళి, చంపావతి, గోముఖనది, సువర్ణముఖీ, వేగావతి.
చూడదగిన స్థలాలు
బొబ్బిలి, తాటిపూడి, పుణ్యగిరి, కుమిలి, రామతీర్థం

కర్నూలు జిల్లా

09:57 వద్ద మార్చి 19, 2010 | ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు లో రాసారు | వ్యాఖ్యానించండి

కర్నూలు జిల్లా


శ్రీకాకుళం జిల్లా

09:39 వద్ద మార్చి 19, 2010 | ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు లో రాసారు | వ్యాఖ్యానించండి

శ్రీకాకుళం జిల్లా

శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమునకు, ఉత్తర- తూర్పు (ఈశాన్యము) దిశన వున్నది. ఈ జిల్లా  ఉత్తర అక్షాంశాల మధ్య మరియు  తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించియున్నది. నాగవాళి నదీ తీరమున ఉన్నది.

చరిత్ర-

ఒకానొక కాలమున, ఈ జిల్లా బౌద్ధ మతానికి ముఖ్య స్థానముగా ఉండెను. ఆ తరువాత, కళింగ సామ్రజ్యమున భాగముగానైనది. 6 నుంచి 14వ శతాబ్దము వరకు (అంటే 800 సంవత్సరాలు), ఈ స్థలము గాంగేయులచే పాలింపబడినది.

విశాఖపట్నం జిల్లాలో భాగముగా ఉండే ఈ జిల్లా, 15 ఆగష్టు 1950న ప్రత్యేక జిల్లాగా అవతరించినది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సాలూరు మండలంలోనుంచి 63 గ్రామాలు, బొబ్బిలి తాలుకా నుంచి 44 గ్రామాలు, విశాఖపట్నం జిల్లాలో క్రొత్తగా ఏర్పరచబడిన గజపతినగరమునకు బదిలీ చేశారు. మరలా 1979 సంవత్సరమున, విజయనగరం జిల్లా ఏర్పడినప్పుడు, సాలూరు, బొబ్బిలి, చీపురుపల్లి, పార్వతీపురం తాలూకాలను, క్రొత్త జిల్లాకు మార్చేశారు.

చరిత్ర-ఒకానొక కాలమున, ఈ జిల్లా బౌద్ధ మతానికి ముఖ్య స్థానముగా ఉండెను. ఆ తరువాత, కళింగ సామ్రజ్యమున భాగముగానైనది. 6 నుంచి 14వ శతాబ్దము వరకు (అంటే 800 సంవత్సరాలు), ఈ స్థలము గాంగేయులచే పాలింపబడినది.
విశాఖపట్నం జిల్లాలో భాగముగా ఉండే ఈ జిల్లా, 15 ఆగష్టు 1950న ప్రత్యేక జిల్లాగా అవతరించినది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సాలూరు మండలంలోనుంచి 63 గ్రామాలు, బొబ్బ్లి తాలుకా నుంచి 44 గ్రామాలు, విశాఖపట్నం జిల్లాలో క్రొత్తగా ఏర్పరచబడిన గజపతినగరమునకు బదిలీ చేశారు. మరలా 1979 సంవత్సరమున, విజయనగరం జిల్లా ఏర్పడినప్పుడు, సాలూరు, బొబ్బిలి, చీపురుపల్లి, పార్వతీపురం తాలూకాలను, క్రొత్త జిల్లాకు మార్చేశారు.

Srikakulam-Dist.jpg

శ్రీకాకుళం జిల్లాలో చూడదగిన స్ధలాలు ->

శ్రీకాకుళం – కోటేశ్వరస్వామి ఆలయము(గుడివీధి), సంతోషిమాత ఆలయం(పాతశ్రీకాకుళం), వెంకటేశ్వరఆలయం (గుజరాతీపేట), కోదండ రామస్వామి ఆలయం, జమియా మసీదు ముఖ్యమైన ప్రార్ధనా స్థలాలు.

కళింగపట్నం –  చారిత్రికంగా సముద్ర వాణిజ్య కేంద్రం. వంశధార నది ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ దర్గా షరీఫ్, షేక్ మదీనా అక్విలిన్ ఉన్నాయి. 23 కిలోమీటర్లవరకు కనుపించే ఒక దీప స్తంభం ఉంది.
బారువ – ఇక్కడ మహేంద్ర తనయ నది సముద్రంలో కలుస్తుంది, ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి ఆలయం, జనార్దన స్వామి ఆలయం ఉన్నాయి. ఒకప్పుడు ఇది ముఖ్యమైన ఓడరేవు. ఇది కొబ్బరి తోటలకు, కొబ్బరి పీచు పరిశ్రమకు కేంద్రం.
పొందూరు – ప్రఖ్యాతి గాంచిన పొందూరు ఖద్దరు తయారయ్యేది జిల్లాలోని పొందూరు లోనే.
మందస – మహేంద్రగిరి కొండ దుగువున ఉన్న ఈ వూరిలో వరాహస్వామి ఆలయం ఉంది. ఇక్కడి కోట దక్షిణ భారతదేశంలోనే ఎత్తైనదిగా చెప్పబడుతున్నది

ఆంధ్ర ప్రదేశ్ రష్ట్రము

09:38 వద్ద మార్చి 19, 2010 | అవర్గీకృతం లో రాసారు | వ్యాఖ్యానించండి
ఆంధ్ర ప్రదేశ్ భారత దేశములోని ఒక ముఖ్యమైన రష్ట్రము. భారత దేశపు “అక్షయపాత్ర” అనే పేరు సంపాదించుకున్నది, మన ఆంధ్ర ప్రదేశ్. ఈ రాష్త్రము భారత దేశమున నాలుగవ అతి పెద్ద రాష్త్రమైనది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, అక్టోబరు 01, 1953 తేదిన ఏర్పడినది. తొలుత ఏర్పడినప్పుడు, కర్నూలు రాష్ట్రమునకు రాజధానిగా వుండెను. నవంబరు 01, 1956 న, రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు మార్చబడినది.

ఆంధ్ర ప్రదేశ్ భారత దేశములోని ఒక ముఖ్యమైన రష్ట్రము. భారత దేశపు “అక్షయపాత్ర” అనే పేరు సంపాదించుకున్నది, మన ఆంధ్ర ప్రదేశ్. ఈ రాష్త్రము భారత దేశమున నాలుగవ అతి పెద్ద రాష్త్రమైనది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, అక్టోబరు 01, 1953 తేదిన ఏర్పడినది. తొలుత ఏర్పడినప్పుడు, కర్నూలు రాష్ట్రమునకు రాజధానిగా వుండెను. నవంబరు 01, 1956 న, రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు మార్చబడినది.

ఈ రాష్ట్రము 12o37′, 19o54′ ఉత్తర అక్షాంశాల మధ్య, 76o46′, 84o46′ తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉన్నది.

భారత ప్రామాణిక రేఖాంశమైన 82o30′ తూర్పు రేఖాంశము రాష్ట్రంలోని కాకినాడ గుండా పోతున్నది.

గోదావరి మరియు కృష్ణా నదులు, రాష్ట్రమున ప్రవహించు ముఖ్యమైన నదులు.

కృష్ణా గోదావరి నదులు (ఉపగ్రహ ఛాయాచిత్రం)

Kumbham.jpg

(రాజముద్ర – పూర్ణ కుంభం)

Map of India with the location of ఆంధ్ర ప్రదేశ్ highlighted.

(ఆంధ్ర ప్రదేశ్ రాప్ట్ర పటము)

ఈ రాష్ట్రము 23 జిల్లాలుగా విభజించియున్నది.

ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు ->

1. కోస్తాంధ్రాకు చెందిన జిల్లాలు –

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా.

2. రాయలసీమకు చెందిన జిల్లాలు –

అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు.

3. తెలంగాణకు చెందిన జిల్లాలు –

ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డీ, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్.

ఆంధ్ర ప్రదేశ్ కు ఉత్తరాన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ భారత దేశములోని ఒక ముఖ్యమైన రష్ట్రము. భారత దేశపు “అక్షయపాత్ర” అనే పేరు సంపాదించుకున్నది, మన ఆంధ్ర ప్రదేశ్. ఈ రాష్త్రము భారత దేశమున నాలుగవ అతి పెద్ద రాష్త్రమైనది.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, అక్టోబరు 01, 1953 తేదిన ఏర్పడినది. తొలుత ఏర్పడినప్పుడు, కర్నూలు రాష్ట్రమునకు రాజధానిగా వుండెను. నవంబరు 01, 1956 న, రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు మార్చబడినది.

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.
Entries మరియు వ్యాఖ్యలు feeds.